రెండు భిన్న పాత్రల్లో ఆకట్టుకోనున్న తాప్సీ..

‘ఝుమ్మంది నాదం’ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి తాప్సీ. మొదట్లో గ్లామర్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ వచ్చిన ఈ బ్యూటీ అనంతరం తన పంథాను మార్చుకొని.. నటనకు ప్రాధాన్యత ఉన్న ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. పింక్, గేమ్ ఓవర్, మిషన్ మంగళ్, తప్పడ్ వంటి చిత్రాలు ఈ వరుసలోకి వస్తాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో చాలెంజింగ్ పాత్రలో నటించనుంది తాప్సీ…

తాప్సీ, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో తమిళంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. కామెడీ థ్రిల్లర్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తాప్సీ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం. ఓ పాత్ర ప్రతినాయిక ఛాయలతో ఉండగా.. మరో క్యారెక్టర్ లో  సంప్రదాయబద్ధమైన అమ్మాయిగా ఆమె కనిపిస్తుందని సమాచారం. భిన్నమైన ఆహార్యంతో రెండు పాత్రలు ఛాలెంజింగ్ గా ఉంటాయని చెబుతున్నారు. ఈ సినిమాలో తాప్సీతో పాటు విజయ్ సేతుపతి కూడా  డ్యూయల్ రోల్ లో  నటించనున్నట్లు చెబుతున్నారు. మరి ఈ సినిమాతో తాప్సీ ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here