వామ్మో ఇదేంద‌య్యా.. పిల్ల‌ల్ని కన‌డానికి స‌హాయం చేస్తారంట‌…

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఎన్నో జీవితాలు త‌ల‌క్రిందులు అయ్యాయి. ఈ ప్ర‌భావంతో చాలా మంది పిల్ల‌ల్ని క‌నేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదంట‌. తాము బ్ర‌తికేందుకే ఇబ్బందులు ఉన్నాయని ఈ ప‌రిస్థితుల్లో కొత్త వారిని జ‌న్మ‌నిచ్చి ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌ని అనుకుంటున్నారు.

అయితే ఈ ప‌రిస్థితి మ‌న దేశంలో కాదంట‌. సింగ‌పూర్‌లో ఇలా జ‌రుగుతోంది. క‌రోనా లాక్‌డౌన్ వచ్చిన నేప‌థ్యంలో ఆదాయాలు పూర్తిగా త‌గ్గిపోయాయి సింగ‌పూర్ ప్ర‌జ‌ల‌కు. దీంతో చాలా మంది పెళ్లిళ్ల‌ను వాయిదాలు వేసుకున్నారు. అయితే కొంద‌రు లాక్‌డౌన్ ఉన్నా పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే పిల్ల‌ల్ని క‌నేందుకు మాత్రం ఆస‌క్తి చూప‌డం లేదు. ఇందుకు కార‌ణం రాబోయే పిల్ల‌ల్ని పోషించేందుకు స‌రైన ఆర్థిక స్తోమ‌త లేక‌పోవ‌డమే అని తెలుస్తోంది.

అయితే ఈ విష‌యం సింగ‌పూర్ ప్ర‌భుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు సిద్ధ‌మైంది. పిల్లల్ని కనాలన్న నిర్ణయాన్ని యువ జంటలు వాయిదా వేసుకన్నట్టు మా దృష్టికి వచ్చిందని సింగ‌పూర్ ఉప ప్ర‌ధాని హెంగ్ స్వీకీట్ అన్నారు. అయితే వీరికి ప్ర‌భుత్వం మీకు ఆర్థిక స‌హాయం చేయాల‌ని అనుకుంటోంది. అయితే ఎంత స‌హాయం చేయాలి అన్న దానిపై త్వ‌ర‌లోనే వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని చెప్పారు. వ‌న్ టైం సెటిల్‌మెంట్ కింద స‌హాయం చేస్తామ‌న్నారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో యువ జంట‌లు హ్యాప్పీగానే ఉంటాయ‌ని అంటున్నారు.

సంతానాన్ని వాయిదా వేసుకోవడంపై ప్ర‌భుత్వం ఎందుకు స్పందించిందంటే రాబోయే త‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని దేశానికి అవ‌స‌ర‌మైన యువ‌త ఉండాల‌న్న ఉద్ద‌శంతోనే ఇలా చేసింద‌ని అంటున్నారు. ఏదేమైనా సంతానంవ‌ద్ద‌నుకున్న వారికి ప్ర‌భుత్వ‌మే ఇలా ప్రోత్సాహం ఇవ్వ‌డం శుభ‌ప‌రిణామం. ఈ విష‌యంపై మ‌న దేశంలో కూడా స‌హాయం చేయ‌మ‌ని ప్ర‌భుత్వాన్ని కోర‌తారేమో మ‌రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here