ప్ర‌ధాని మోదీ మ‌రో ఘ‌న‌త‌..

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌రో రికార్డు సాధించారు. విరామం లేకుండా ప్రభుత్వ కార్యాలయంలో 20వ సంవత్సరంలోకి మోదీ ప్ర‌వేశించారు. 2019 ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో విజ‌యం సాధించిన మోదీ అత్య‌ధిక కాలం ప్ర‌ధానిగా ప‌నిచేసిన వ్య‌క్తిగా ఇదివ‌ర‌కే రికార్డు సాధించారు.

న‌రేంద్ర మోదీ చాయ్ వాలా నుంచి ప్ర‌ధాని వ‌ర‌కు ఎదిగిన వైనంపై ఎన్నో క‌థ‌నాలు వ‌స్తుంటాయి. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ బాధ్యతలు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న రాజ‌కీయ జీవితం కొన‌సాగుతూనే ఉంది. 2007,  2012 ఎన్నిక‌ల్లో గెలిచి సీఎంగా బాద్య‌త‌లు చేప‌ట్టారు. ఆ త‌ర్వాత 2014లో ఆయ‌న ప్ర‌ధానిగా బాద్య‌త‌లు చేప‌ట్టి.. 2019లో సైతం మ‌ళ్లీ రెండో సారి ప్ర‌ధాని అయ్యారు. దీంతొ 2001 అక్టోబ‌రు 1 నుంచి 2020 అక్టోబ‌ర్ 7 అంటే నేటికి ఆయ‌న విరామం లేకుండా ప్ర‌భుత్వ కార్యాల‌యంలో 20వ సంవ‌త్స‌రం ప్ర‌వేశించారు.

20 ఏళ్లుగా ఆయ‌న ప్ర‌జాదార‌ణ పొందిన నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా అత్య‌ధిక కాలం ప్ర‌ధానిగా ప‌నిచేసిన కాంగ్రెసేతర నేత‌గా మోదీ రికార్డు సృష్టించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ల తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన ఘనతను నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు. నెహ్రూ 17 సంవత్సరాల పాటు,  ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు, మన్మోహన్‌ సింగ్‌ వరుసగా ఐదేళ్లపాటు రెండు సార్లు ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టారు. ఇప్పుడు మోదీ దేశంలో అత్యధిక కాలం ప్రధాని పగ్గాలు చేపట్టిన నాలుగో నేతగా అరుదైన ఘనతను సాధించారు. నెహ్రూ తర్వాత ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన అనంతరం తిరిగి మరోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టింది మన్మోహన్‌ సింగ్‌, నరేంద్ర మోదీలే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here