రోజూ రాత్రి వైన్ తాగడం మంచిదేనా..?

వైన్ లేనిదే వాళ్లకు ముద్ద దిగేది కాదట. ఇలాంటి వైన్స్ తాగడం ఇప్పుడే ప్రారంభమైందేమీ కాదు. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరం సమయంలో వైన్ ను ఎక్కువగా తాగేవారట

రోజు వైన్ తాగడమా? ఇంకేమన్నా ఉందా? వైన్ తాగితే లివర్ చెడిపోతుంది.. అది చెడిపోతుంది.. అని డాక్టర్లు భయపెట్టిస్తుంటారు.. మీరేంది రోజూ రాత్రి వైన్ తాగండి.. ఎప్పుడూ యవ్వనంగా ఉండండి అని మాట్లాడుతున్నారు.. అని అంటారా? కాస్త మేం చెప్పేది పూర్తిగా వినండి.. ఇదేదో మేం చెబుతున్నది కాదు.. వైన్ చాలా రోగాల బారి నుంచి కాపాడుతుందని పరిశోధనల్లో తేలింది

అయితే.. ఏది పడితే ఆ వైన్ తాగడం కాదు.. బ్లాక్ బెర్రీ, వోట్స్ లాంటి వాటితో చేసిన వైన్ మాత్రమే ఆరోగ్యానికి మంచిదట. దాంట్లో కార్బనెట్ ఎక్కువగా ఉంటుందట. అది మంచిదట. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండాలంటే వైన్ తాగాల్సిందేనని పరిశోధకులు చెబుతున్నారు. రెడ్ వైన్, వైట్ వైన్ కూడా మంచిదేనట. కాకపోతే రోజూ రాత్రి మోతాదులో తీసుకోవాలట. ఇలాంటి వైన్స్ తాగడం ఇప్పుడే ప్రారంభమైందేమీ కాదు. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరం సమయంలో వైన్ ను ఎక్కువగా తాగేవారట. వైన్ లేనిదే వాళ్లకు ముద్ద దిగేది కాదట. ఈజిప్షియన్లు వైన్ ను ఔషధంగా కూడా ఉపయోగించేవారట. ఇక.. రెడ్ వైన్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందట. అయితే.. రెడ్ వైన్ లో ఆమ్లజనకాలు ఉంటాయట. అవి గుండె సంబంధిత వ్యాధుల బారిన పడనీయవట.

వైన్ మోతాదుగా రోజూ తీసుకుంటే కలిగే ప్రధానమైన లాభం.. ఎక్కువ కాలం జీవించడం. అది ఆయుష్షును పెంచుతుందట. వైన్ కాకుండా.. బీర్లు, మద్యం తాగేవాళ్లు తొందరగా మరణిస్తారట. రెగ్యులర్ గా వైన్ తాగేవాళ్లు 34 శాతం తక్కువగా మరణిస్తారట.

రెగ్యులర్ వైన్.. యవ్వనంగా ఉంచుతుందట. చర్మం మీద ఉన్న ముడతలను తొలగిస్తుందట. నిత్య యవ్వనంగా ఉంచుతుందట. వృద్ధాప్య లక్షణాలు రాకుండా చేస్తుందట. రెడ్ వైన్ లో ఉండే రెస్వెట్రాల్ వృద్ధాప్య లక్షణాలను రానివ్వదట. ఒకవేళ మీకు వైన్ అందుబాటులో లేకపోతే… ద్రాక్ష, బ్లూబెర్రీస్, క్రాన్ బెర్రీస్ లాంటి వాటిని రోజూ తిన్నా వృద్ధాప్య చాయలు మీ దరిచేరవు. వైన్ లో ఉండే ప్లేవానాయిడ్స్ చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. అందుకే.. చర్మ సంబంధ వ్యాధులు కూడా దరిచేరవు. హైబీపీ ఉన్నవాళ్లకూ వైన్ చాలా బెస్ట్ అట. మధుమేహాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బులు ఎక్కవగా వచ్చే ప్రమాదం ఉంటుంది. వాళ్లు రెడ్ వైన్ తాగితే వాళ్లకు డయాబెటిస్ కంట్రోల్ లో ఉండటంతో పాటు గుండె జబ్బులు రావట. చూశారా? వైన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇంకెందుకు ఆలస్యం.. ఈరోజు నుంచి వెంటనే రెడ్ వైన్ తాగేయండి. లిమిట్ గా అనే విషయం మరిచిపోవద్దు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here