రాజ‌మౌళికి షాక్ ఇచ్చిన రాం గోపాల్ వ‌ర్మ‌..

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ మ‌రో వివాదాస్ప‌ద ట్వీట్ చేశారు. ఇటీవ‌ల రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు సెల‌బ్రెటీలంద‌రూ మొక్కులు నాటుతుండ‌టం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే ఇటీవ‌లె డైరెక్ట‌ర్ రాజ‌మౌళి మొక్క‌లు నాటారు.

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. సినీ ప్రముఖులందరూ ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటూ మొక్కలు నాటుతున్నారు. అనంతరం తమ స్నేహితులను నామినేట్ చేస్తున్నారు. రాజ‌మౌళి మొక్క‌లు నాట‌డంతో పాటు డైరెక్ట‌ర్లు పూరి జ‌గ‌న్నాథ్‌ను, రాం గోపాల్ వ‌ర్మ‌ను నామినేట్ చేశారు. అయితే రాం గోపాల్ వ‌ర్మ రాజ‌మౌళికి షాక్ ఇచ్చారు.

ఈ ఛాలెంజ్‌ను స్వీకరించనని ట్వీట్ చేశారు. రాజమౌళి సర్ నేను గ్రీన్‌కు, ఛాలెంజ్‌లకు చాలా దూరం. మట్టిని ముట్టుకోవడం అంటే నాకు అసహ్యం. మొక్కలకు నాలాంటి స్వార్థపరుడి అవసరం లేదు. మీకు, మీ మొక్కలకు ఆల్ ది బెస్ట్` అని వర్మ పేర్కొన్నారు. దీంతో ఇది వైరల్ అవుతోంది. అంద‌రూ ఇలా ఛాలెంజ్‌లు విసురుకుంటూ మొక్కులు నాటుతుంటే వ‌ర్మ మాత్రం ఇవేవి త‌న‌కు న‌చ్చ‌వ‌ని అంటున్నారు. అయితే హీరో రాం చ‌ర‌ణ్ మొక్క‌లు నాటి రాజ‌మౌళిని నామినేట్ చేయ‌డం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here