మీడియా బాధ్యతాయుతం గా లేకపోతే ఇంతే

నిజజీవితంలో సెలబ్రిటీల లైఫ్ కు సామాన్యుల లైఫ్ కు చాలా వ్యత్యాసం కనబడుతుంది. సామాన్యుడిని తప్పు చేస్తే మామూలు కొట్టుకెళ్ళి పోతుంది… అదే ఓ సెలబ్రిటీ తప్పు చేస్తే రచ్చ రచ్చ జరుగుతోంది… ఇక హీరోలు విషయానికొస్తే వారు పబ్లిసిటీ ఇచ్చే ప్రోడక్ట్ లు ఏమైనా తేడా జరిగితే మీడియాలో ముందు వాతలు పడేది వీరికే…తాజా గా ఓ సంఘటన మళ్ళీ దీన్ని రుజువు చేసింది. ఒక టివి ఛానల్ ‘హైదరాబాద్ లో మైనర్లకు మద్యం అమ్ముతున్న పబ్బులు’ అంటూ ఒక కార్యక్రమం వేసింది.

ఈ క్రమంలో అల్లు అర్జున్ మొన్న ఈ మధ్య  కొత్తగా ఓపెన్ చేసిన బి-డబ్స్ రెస్టో బార్ తాలూకు విజువల్స్ చూపెట్టారు దీంతో బన్నీ విమర్శలను ఎదుర్కొవల్సివచ్చింది..ఇప్పుడు అస్సలు విషయానికి వస్తే హీరో రామచరణ్ యువి ప్రొడక్షన్స్ వాళ్లతో కలసి ధియేటర్ల వ్యాపారంలోకి దిగుతాడట. రామచరణ్  ఎప్పుడైతే ధియేటర్లను కొన్నాడో.. వెంటనే చిన్న సినిమాలకు చరణ్‌ ధియేటర్లు ఇవ్వకుండా చిన్న నిర్మాతలను తొక్కేస్తున్నాడు అనీ  అంతే కాకుండా ఇండస్ట్రీ లో వీళ్ళ ఫ్యామిలీ మాత్రం ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు  అంటూ మనం హెడ్ లైన్స్ చూడాల్సి రావొచ్చేమో కదూ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here