మరింత ఆలస్యం కానున్న ‘సర్కారు వారి పాట’..?

మహేష్‌ బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కావు వారి పాట’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈచిత్రంలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా కన్ఫామ్‌ చేసినట్లు ఇటీవల చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభించిన ఈ సినిమా చిత్రీకరణ కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా కేంద్రం ఇచ్చిన సడలింపులతో అన్ని సినిమాలు చిత్రీకరణలు మొదలుపెట్టాయి. ఈ తరుణంలోనే సర్కావు వారి పాట కూడా పట్టాలెక్కనుందని చర్చలు జరిగాయి. నవంబర్‌ నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకానున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే తాజా సమచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ నుంచి ప్రారంభంకావాల్సిన సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడినట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే ఈ సినిమా చిత్రీకరణ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. అయితే ఎలాగో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోవడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది కాబట్టి..చిత్రీకరణ కూడా కాస్త ఆలస్యంగా ప్రారంభిస్తేనే బాగుంటదన్న ఆలోచనలో సినిమా యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే షూటింగ్‌ను మరికొంత ఆలస్యంగా ప్రారంభించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరి ఆ గ్యాప్‌లో మహేష్‌ ఏదైనా కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తాడా..లేదా హాలీడేను ఎంజాయ్ చేస్తాడా?చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here