బాలయ్య ఫాన్స్ ని కొట్టడం పక్కన పెట్టండి .. ఇలాంటి గొప్ప పనులు చేస్తాడు తెలుసుకోండి

బాలకృష్ణ తన ఫాన్స్ ని కొట్టాడు అనీ , బాలయ్య ప్రవర్తన చాలా ఎబ్బెట్టుగా ఉంటోంది అనీ కామెంట్ చేసే చాలా మందికి ఈ వార్త పెద్ద కవచం లాగా అనిపిస్తుంది. ముఖ్యంగా బాలయ్య ఫాన్స్ , నందమూరి ఫాన్స్ ఈ న్యూస్ ని బాగా స్ప్రెడ్ చెయ్యాలి. ఇవాళా రేపూ ఎక్కడ చూసినా బాలకృష్ణ ఆ ఫాన్ ని కొట్టాడు ఈ ఫాన్ ని తన్నాడు అంటున్నారు కానీ తెరవేనకాల బాలయ్య చేసే గొప్ప విశేషాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తున్నాయి. తన 101వ చిత్రం పైసా వసూల్ విడుదల కి సిద్దం అవుతున్న వేళలో బాలయ్య అనంతపూర్ లో 101  మంది పిల్లలను ఎంపిక చేసి వారికి తన సొంత డబ్బు తో ఒక్కొక్కరికీ 10 వేలు చొప్పున చదువు నిమిత్తం పంచి పెట్టారు బాలయ్య.  తన వెన్నంటి నిలిచిన అభిమానుల పిల్లల్లో 101 మంది ప్రతిభావంతులను ఎంపిక చేయాలని బాలయ్య నిర్ణయం తీసుకోగా ఈ సంవత్సరం వచ్చిన మార్కుల ఆధారంగా బాగా చదవగలిగి ఉండి సరైన డబ్బు స్తోమత లేనివారిని ఎంచుకున్నారు అభిమానులు. అనంతపురం లైబ్రరీ లో దగ్గర ఈ పురస్కారం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here