ప్రభాస్ పుట్టినరోజున భారీ ప్రకటన రానుందా..?

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఓ స్థాయిలో పెరిగిపోయింది. ఈ హీరో నుంచి సినిమా వస్తుందంటే చాలు..  యావత్ భారతీయ సినిమా పరిశ్రమ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ తర్వాత ‘ఆది పురుష్’లో  నటించనున్నాడని అందరూ భావించారు. కానీ ఆ సినిమాలోపే ప్రభాస్ మరో సినిమాలో నటించనున్నాడనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి..

తాజా సమాచారం ప్రకారం కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. హోమబుల్ ఫిల్మ్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించనుంది. ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్ క‌థ‌ చెప్పాడని, దానికి వెంట‌నే ప్ర‌భాస్ ఓకే చెప్పేసిన‌ట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ రానున్నట్లు సమాచారం. మరి ఆ రోజు సినిమా టైటిల్ ను ప్రకటిస్తారా.?  లేదా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారా..  చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here