గూగుల్ ప్లే స్టోర్‌లోకి తిరిగొచ్చిన పేటీఎం.. ఎందుకీ వివాదం..

గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎంను తొల‌గించిన కొన్ని గంట‌ల్లోపే తిరిగి పేటీఎం ప్లే స్టోర్‌లోకి వ‌చ్చేసింది. గూగుల్ లో జూదాలు, ఆన్‌లైన్ బెట్టింగులు నిర్వ‌హించ‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌లు ఉన్నాయి. అయితే పేటీఎంతో పాటు పేటీఎం ఫ‌స్ట్ గేమ్‌లో ఫాంట‌సీ క్రికెట్ సేవ‌లు మొద‌లుపెట్టింది. దీంతో జూదాన్ని ప్రేరేపించేలా ఈ చ‌ర్య ఉండ‌టంతో గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎంను తొల‌గించిన‌ట్లు పేర్కొంది.

గూగుల్ తొల‌గించిన కొద్ది గంట‌ల్లోపే పేటీఎం సవ‌ర‌ణ‌లు చేసుకుంది. పేటీఎం క్రికెట్ లీగ్ గేమ్‌లో క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్‌ను తొల‌గించింది. అనంత‌రం పేటీఎం వ్య‌వ‌స్థాప‌కుడు విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ ఘాటుగానే స్పందించారు. కొత్త వినియోగ‌దారుల‌ను పేటీఎం పెంచుకోకుండా ఉండేందుకు కావాల‌నే గూగుల్ ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని వ్యాఖ్య‌లు చేశారు. అయితే గూగుల్ నిబంధ‌న‌లు ఉల్ల‌ఘించినందుకే ఇలా చేశామ‌ని గూగుల్ చెబుతోంది.

కాగా పేటీఎంను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొల‌గించిన వెంట‌నే యూజ‌ర్స్ ఆందోళ‌న చెందారు. పేటీఎం ద్వారా చెల్లింపులు చేసుకునే వారంతా పేటీఎం మ‌నీ ఫిక్స్ చేసుకొని ఉంటారు. ఈ పరిస్థితుల్లో పేటీఎం గూగుల్‌లో లేనందున కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయేమో అన్న భ‌యాన్ని వ్య‌క్తం చేశారు. అయితే ఎవ్వ‌రికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా పేటీఎం అతి కొద్ది స‌మ‌యంలోనే ప్రారంభ‌మ‌వ్వ‌డం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here