అఖిల్ పెళ్లి బాధ్యతను సమంత తీసుకుందా..? 

అక్కినేని వారసుడు అఖిల్ వివాహం సోదరుడు నాగ చైతన్య కంటే ముందే జరగాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వివాహం రద్దు అయిన విషయం తెలిసిందే. శ్రేయా భూపాల్‌తో నిశ్చితార్థం తర్వాత.. అనూహ్యంగా అఖిల్‌ పెళ్లి క్యాన్సిల్‌ అయింది. అయితే శ్రేయా భూపాల్ మరొకరిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అఖిల్ మాత్రం పెళ్లి చేసుకోకుండా… తన వృత్తిలో బిజీగా మారాడు.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి అఖిల్‌ పెళ్లి వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అఖిల్‌ అక్కినేని పెళ్లి ఫిక్స్ అయిందని, ఈసారి అఖిల్‌ పెళ్లి బాధ్యతలను ఆయన వదిన సమంత తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఓ వ్యాపారవేత్త కుమార్తెతో అఖిల్‌ పెళ్లి ఫిక్సయిందని, ఈ పెళ్లి విషయంలో ఇరు కుటుంబాలను ఒప్పించే పనిలో సమంత ఉన్నట్లు తెలుస్తోంది. మరి అఖిల్ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కనున్నాడో లేదో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here