పార్ల‌మెంటులో నీలి చిత్రాలు చూస్తున్న ఎంపీ…

పార్లమెంటులో నీలి చిత్రాలు చూస్తూ ఓ ఎంపీ అడ్డంగా బుక్క‌య్యాడు. అయితే ఇది మ‌న దేశంలో కాదు థాయ్‌లాండ్‌లో జ‌రిగింది. పార్ల‌మెంటు జ‌రుగుతుండగా నీలి చిత్రాలు చూస్తున్న ఈయ‌న విషయం బ‌య‌ట‌కు రావ‌డంతో ప్లేటు మార్చారు. ఓ క‌థ చెప్పారు.

థాయ్‌లాండ్ దేశ రాజ‌ధాని బ్యాంకాక్‌లోని పార్ల‌మెంటులో బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి బ‌డ్జెట్ ప్ర‌సంగం చ‌దువుతుండ‌గా ఆ పార్టీకి చెందిన ఎంపీ రోన్న‌తెప అనువాద్ నీలి చిత్రాలు చూస్తున్నారు. ఈ విష‌యాన్ని వెన‌క గ్యాల‌రీలో ఉన్న జ‌ర్న‌లిస్టులు చూశారు. దీంతో వారు ఆయ‌న్ను ప్ర‌శ్నించ‌గా చూస్తున్న‌ది నిజ‌మేన‌ని చెప్పి మ‌ళ్లీ షాక్ ఇచ్చారు. అయితే తాను ఈ నీలి చిత్రాలు చూడ‌టానికి ప్ర‌ధాన కార‌ణం ఉంద‌న్నారు.

విష‌యం అంత‌ర్జాతీయ మీడియాలో రావడంతో ఎంపీ ఆందోళ‌న‌లో ప‌డ్డారు. అయితే తానేమీ ఆ చిత్రాలు టైం పాస్‌కి చూడ‌లేద‌ని.. మ‌హిళ స‌హాయం కోసం ప్రాదేయ‌ప‌డుతోంద‌న్నారు.. అది నిజ‌మా అబ‌ద్ద‌మా అని తెలుసుకునేందుకు చూశాన‌ని చెప్పారు. ఈ చిత్రాలు లైన్ అనే యాప్ ద్వారా వ‌చ్చాయ‌ని తెలిపారు. కొంత మంది గ్యాంగ్‌స్టర్లు ఆమెను వేధింపులకు గురి చేస్తూ ఆమె చిత్రాలు తీసినట్లు కనిపిస్తోందన్నారు. అనంత‌రం ఆయ‌న ఫోటోల‌ను డిలీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here