ప్రభాస్ చిత్రానికి సంబంధించిన ఆ కిల్లర్ అప్డేట్ ఏంటో.?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో పుల్ జోష్ మీదున్నాడు. ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించి సంచలనం సృష్టించాడు ప్రభాస్. వీటిలో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉన్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించనుంది.

ఇదిలా ఉంటే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు అనే విషయం అందరికి తెలిసిందే. సాధారణంగా పుట్టినరోజు కానుకగా సినిమా యూనిట్ కచ్చితంగా తమ చిత్రాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తుంటుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మూడు చిత్రాలకు సంబంధించి.. అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే నాగ అశ్విన్ ను ప్రభాస్ అభిమాని ఒకరు.. ‘మీ సినిమా నుంచి డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఏదైనా అప్డేట్  ఉంటుందా’ అని ప్రశ్నించాడు. దీనికి సమాధానం ఇచ్చిన నాగ అశ్విన్. ‘బర్త్ డే కి ఎలాంటి అప్డేట్ ఉండదు. కరోనా వల్ల సినిమా షూటింగ్ స్టార్ట్ కావడానికే చాలా టైం ఉంది. అందుకే ఇప్పుడు ఏమీ రిలీవ్ చేయలేము. కానీ అతి త్వరలో ప్రభాస్ పుట్టినరోజు కంటే ముందు ఒక కిల్లర్ అప్డేట్ మాత్రం ఉంటుంది” అని పేర్కొన్నాడు.  ఇంతకీ ఆ కిల్లర్ అప్డేట్ ఏమై ఉంటుందని.. అభిమానుల్లో ఇప్పటి నుంచే ఆత్రుత మొదలైంది. మరి ఆ కిల్లర్ అప్డేట్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here