నేను ఇంకా బతికి ఉన్నాను అంటే దానికి కారణం ఇదే .. – మహేష్ బాబు

మహేష్ బాబు .. ఈ పేరు చెప్తే చాలు పడి చచ్చే అభిమానులు ఉన్నారు.మా హీరో కోసం ప్రాణాలు సైతం లెక్క చేయము మేము అంటారు వాళ్ళు. కానీ మరి మహేష్ బాబుకి ప్రాణమైన వ్యక్తి ఎవరో తెలుసా ? ఆయన కొడుకు గౌతం కృష్ణ .. అవును ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు కూడా. `నా అస్తిత్వానికి కార‌ణం వాడు.. న‌న్ను న‌డిపించేది వాడు.. నా కుమారుడు.. నా ప్ర‌పంచం.. నా ఆనందం.. పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు, గౌత‌మ్‌.. ఆనందంగా ఉండు` అంటూ హీరో మ‌హేశ్ బాబు ట్వీట్ చేశాడు . ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 12 సంవత్సరాల గౌతం కృష్ణ ఇవాళ తన పుట్టిన రోజు చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటూ ఉన్నాడు. 2005 లో పెళ్లి చేసుకున్న మహేష్ బాబు – నమ్రాతల కి 2006 ఆగస్ట్ 31 న గౌతం కృష్ణ జన్మించాడు. 2012 జూలై 20 న సితార పాప పుట్టింది. 1 నేనొక్కడినే సినిమాతో ఇప్పటికే మన చిన్ని సూపర్ స్టార్ అరంగేట్రం కూడా చేసాడు. ఇవాళ మహేష్ అంత ఎమోషనల్ గా మెసేజ్ పెట్టడం చూస్తుంటే కొడుకు మీద మహేష్ ప్రేమ అర్ధం అవుతోంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here