నా కుటుంబంలో ఏంటీ…  నేనే వేధింపులు ఎదుర్కోన్నా.!

తాజాగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపు ఆరోపణలు బాలీవుడ్ తో పాటు యావత్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పలువురు నటీమణులు పాయల్ కు మద్దతుగా నిలుస్తున్నారు.  ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్ కస్తూరి చేసిన పలు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఈ వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కస్తూరి..’

పాయల్ చేసిన ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అనురాగ్‌పై పాయల్ చేసిన ఆరోపణలు కోర్టులో నిలబడవు, ఆధారాలు లేకుండా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై ఓ నెటిజన్ స్పందిస్తూ.. `ఇలాంటి పరిస్థితి మీ కుటుంబంలో ఎవరికైనా వస్తే ఇలాగే మాట్లాడతారా?` అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన కస్తూరి.. `నా కుటుంబంలో ఏంటి? నేనే అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా. నేను కూడా దానికి బాధితురాలినేన`ని రిప్లై ఇచ్చింది. దీంతో కస్తూరి కూడా గతంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పకనే చెప్పడంతో ఈ అంశం ఇప్పుడు మరో కొత్త చర్చకు దారి తీసింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here