సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎప్పటికి ఇంటికే పరిమితమా.. ఆఫీస్ లేనట్లేనా..

కరోనా వచ్చిన తర్వాత దేశంలో ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతినింది. చాలా వరకు కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. పలు కంపెనీలు ఇంటి నుండే పని చేపించుకుంటున్నాయి. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాగే కొనసాగే పరిస్థితులు కొనసాగుతాయని మేధావులు అంచనా వేస్తున్నారు.

కరోనా తర్వాత కూడా ఆఫీసుల్లో ఉద్యోగులను పూర్తిగా అనుమతించేందుకు యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయని తెలుస్తోంది. ఇది ఎవరో చెప్పిన మాటలు  కాదు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అంటున్నారు. కరోనా పరిస్థితులు చక్కపడిన అనంతరం 50 శాతం కంటే తక్కువ ఉద్యోగులను ఆఫీస్ లకు అనుమతించే అవకాశాలు పరిశీలిస్తున్నాయని చెప్పారు.

అంతేకాకుండా ఆఫీసులో ఉండే సమయం కూడా తగ్గించుకునే ఆలోచన చేస్తున్నారు. అయితే ఇంటి నుండి పని చేసేవారికి ఇది మంచి పరిణామమే అయినా ఇది అందరికీ వర్తించదని చెబుతున్నారు. సాఫ్ట్ వేర్ మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. కాగా చిన్న చిన్న ఇల్లు ఉన్న వారికి ఇది వర్తించదని చెప్పారు. అయితే ఆయనకు మాత్రం ఇది బాగా కలిసొచ్చిందని చాలా పనులు చేసుకున్నట్లు చెప్పారు. మరి ఈయన మాటలను బట్టి చూస్తే కరోనా తర్వాత కూడా ఉద్యోగులు ఇంటి నుండే పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మంచిదే అయినా ఉద్యోగుల వేతనాల్లో వస్తున్న మార్పులే ఆందోళన కలిగిస్తున్నాయి. వేతనాల్లో కోతలు లేకుండా ఎక్కడినుండైన పని చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు.

మరో ఆరు నెలల్లో కొత్త కొత్త కంపెనీలు ప్రారంభం అవుతాయని వార్తలు వస్తున్నాయి. దీని కోసమే లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు రావడం మంచిదే అని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో అవకాశాలు బాగా ఉంటాయని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here