మోడీ సపోర్ట్ ఫుల్.. అందుకే టిడిపి విమర్శలు..

ఏ చిన్న అవకాశం దొరికినా ప్రతిపక్షాలు అధికార పక్షంపై ఆరోపణలు చేయడం రాజకీయాల్లో మాములే. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఏ అవకాశం లేకున్నా అధికార పార్టీని ప్రజల్లో బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. తాజాగా జగన్ ఢిల్లీ పర్యటనపై కూడా పచ్చ పార్టీ నేతలు విమర్శించడం మొదలుపెట్టారు.

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించారు. అభివృద్ధి చెందుతున్న ఏపీని ఆదోకోవాల్సిన అవసరం ఉందని.. అందుకు ఏ అవకాశం ఉన్నా కల్పించాలని కోరారు. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నిధులపై మాట్లాడారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఇక్కడే టిడిపి నేతలకు నచ్చడం లేదని తెలుస్తోంది. జగన్ ఎక్కడ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటారో అన్న భయం పట్టుకుంది. దీంతో ప్రతి విషయంలో జగన్ పై విమర్శలు చేయడం మొదలెట్టారు.

ఇప్పుడు టిడిపి నేత యనమల రామకృష్ణుడు జగన్ టూర్ పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆయనకి కేసుల భవిష్యత్తు తప్ప రాష్ట్ర భవిష్యత్తు పట్టదన్నారు. 16 నెలల కాలంలో జగన్ కేంద్రం నుండి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు బకాయిలు విడుదల చేస్తామని కేంద్రం ఇటీవల పార్లమెంటులో కూడా చెప్పింది. కేంద్ర మంత్రులు కూడా క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ టిడిపి నేతలు ఇలా వ్యాఖ్యలు చేయడంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మోడీ జగన్ పాలనపై ప్రశంశించిన విషయం తెలిసిందే. దీన్ని జీర్ణించుకోలేని టిడిపి కావాలనే జగన్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. మోడీ సపోర్ట్ జగన్ కి ఉండటంతో టిడిపికి వణుకు పుట్టిందని ఏపీలో టాక్ నడుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here