నటనపై ఆసక్తి ఉందా.? అయితే ఈ అవకాశం మీకోసమే!

సినిమా ఇండస్ట్రీలో రాణించాలనుకుంటున్నారా.?ఒక్క ఛాన్స్‌ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారా? అయితే ఈ అవకాశం మీకోసమే. ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ నూతన నటీనటుల కోసం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఓటీటీ రంగం విస్తరిస్తోన్న నేపథ్యంలో అన్ని నిర్మాణ సంస్థలు ఈ వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో తెరకెక్కనున్న ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు గాను అన్నపూర్ణ స్టూడియోస్‌ ట్విట్టర్‌లో ప్రకటన విడుదల చేసింది.

ఈ వెబ్‌ సిరీస్‌కు ఎవరెవరు కావాలంటే..వెబ్‌ సిరీస్‌లో ప్రధాన, ఇతర సహాయ పాత్రల్లో నటించేందకు గాను నటులు (25-40 సంవత్సరాలు), నటీమణులు (22-35) కోసం కాస్టింగ్‌ కాల్‌ నిర్వహిస్తున్నట్లు అన్నపూర్ణ సంస్థ పేర్కొంది. తెలుగు మాట్లాడే వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు తెలిపింది. ఆసక్తి ఉన్న వ్యక్తులు తమ క్లోజప్ ఫొటోలను, ఫ్రొఫైల్‌ను, కాంటాక్ట్ వివరాలను `casting@annapurnastudios.com` ఐడీకి మెయిల్ చేయాలని సూచించింది. ఇంకెంటీ మరి నటులుగా మారే ఈ అదృష్టాన్ని మీరూ పరీక్షించుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here