దేశ వ్యాప్తంగా ఢిల్లీలో ఎక్కువ‌గా చ‌లి.. 65 ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు..

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఉష్ణోగ్ర‌త‌లు అత్యంత త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. దాదాపుగా 65 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఇప్పుడే మొద‌టిసారి ఇంత త‌క్కువ‌గా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వ్వ‌డం అని తెలుస్తోంది. క‌రోనా విజృంభిస్తున్న వేళ ఇంత త‌క్కువ స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు ఉండ‌టం అత్యంత ఆందోళ‌న‌క‌రంగా ఉంది.

ఢిల్లీ ప్ర‌జ‌లు చలిలో వణికిపోతున్నారు. బయట అడుగుపెట్టేందుకు భయపడుతున్నారు. ఈ నెలలో దేశ రాజధానిలో వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నవంబరులో ఉష్ణోగ్రతలు ఏకంగా 10.2 డిగ్రీలకు పడిపోయినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో పడిపోవడం 71 ఏళ్లలో ఇది తొలిసారి. నవంబరు 1949లో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 10.2 డిగ్రీలకు పడిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లు అదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.

ఢిల్లీలో సోమవారం అత్యల్పంగా 6.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే పడిపోవడం ఈ నెలలో ఇది ఎనిమిదోసారి. ఈ నెల 23న ఢిల్లీలో 6.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నవంబరు 2003 తర్వాత ఇంత కనిష్టంగా నమోదు కావడం ఇదే తొలిసారి కాగా, అప్పట్లో 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అక్టోబరులోనూ అత్యల్పంగా 17.2 డిగ్రీలు నమోదైంది. 58 ఏళ్లలో ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here