దేశంలో అక్క‌డ ఎక్కువ‌గా పెట్రోల్ ధ‌ర‌లు.. ఏ రాష్ట్రంంలో ఎంతో తెలుసా..

దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి. పెట్రోల్‌తో పాటు డీజిల్ ధ‌ర‌లు కూడా పెరిగాయి. దేశంలో ఏ రాష్ట్రంలో ఎంత ధ‌ర‌లు ఉన్నాయో వివ‌రాలు వెల్ల‌డయ్యాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు నింగినితాకాయి. లీటరు పెట్రోలు ధర రూ.90కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 81 రూపాయలుగా ఉంది. గడచిన వారం రోజుల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సామాన్యునిపై భారం పడుతోంది. దేశరాజధాని ఢిల్లీలో ఈరోజు లీటరు పెట్రోలు ధర రూ. 82.34గా ఉండగా, డీజిల్ ధర రూ.72.42గా ఉంది. ప్రతీరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులు చోటుచేసుకుంటాయి.

వాటి ధరలను ఉదయం 6 గంటలకు ప్రకటిస్తారు. పెట్రోల్, డీజిల్ రేట్లపై ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమిషన్ మొదలైనవి వడ్డిస్తుండటంతో వీటి ధరలు రెండింతలు అవుతున్నాయి. ఇక ముంబైలో ఈరోజు పెట్రోలు లీటరు ధర రూ. 89.02గా ఉండగా, డీజిల్ ధర రూ. 78.97గా ఉంది. కోల్‌కతా పెట్రోల్ రూ. 83.87, డీజిల్ రూ .75.99గా ఉండగా, చెన్నైలో పెట్రోల్ రూ. 85.31, డీజిల్ ధర రూ. 77.44 రూపాయలుగా ఉంది. నోయిడాలో పెట్రోల్ రూ. 82.62, డీజిల్ రూ. 72.83, లక్నోలో పెట్రోల్ రూ. 82.54, డీజిల్ లీటరుకు రూ. 72.75, పట్నాలో పెట్రోల్ రూ. 84.93, డీజిల్ లీటరుకు రూ. 77.80గా ఉంది. ఇక చండీగఢ్‌లో పెట్రోల్ రూ. 79.28, డీజిల్ లీటరుకు రూ.72.17గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here