సోనూసూద్ కోసం అభిమానులు ఏం చేస్తున్నారో తెలుసా..

ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్ గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. గ‌త ఆరు నెల‌ల కాలంలో ఆయ‌న దేశంలోని అంద‌రికీ తెలిసిపోయారు. క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆయ‌న చేసిన సేవ‌లు మ‌రువ‌లేనివి. అందుకే అభిమానులు ఆయ‌నకు ఇప్పుడు గుడి క‌డుతున్నారు.

క‌రోనా స‌మ‌యంలో ఒక‌చోట నుంచి మ‌రో చోటికి వెళ్ల‌లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న వారిని సోనూసూద్ దేవుడిలా ఆదుకున్నారు. ఓ వైపు ప్ర‌భుత్వాలు చేసే ప‌ని చేస్తున్నా ఎంతో మందిని సోనూ సొంతంగా విమానాల ఖ‌ర్చులు పెట్టుకొని మ‌రి సొంత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. దీంతో ఇప్పుడు అభిమానులు ఆయ‌న్ను గుండెల్లో కాకుండా గుడి క‌ట్టుకొని పూజించాల‌ని అనుకుంటున్నారు. రియల్‌ హీరోకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో అభిమానులు ఏకంగా గుడులు కట్టేస్తున్నారు. అలాంటి పనులు చేయకండి..నేను వాటికి అర్హుడిని కాను బాబోయ్‌! అని సోనూ చెబుతున్నా అభిమానులు వినడం లేదు. సాధారణంగా గుండెల్లో గుడులు కడుతుంటారు. సోనూసూద్‌ ఆ స్థాయిని దాటేశాడు.. ఇప్పుడు గుండెల్లోని గుడులు కాస్త బయటే కట్టేస్తున్నారు. అభిమానులంటే అంతే మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here