దీపావ‌ళికి అభిమానుల కోసం ఆర్ఆర్ఆర్ ఏం చేసిందో తెలుసా..

స్టార్ హీరోల‌తో క‌లిసి స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తీస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్‌. సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ముగ్గురు స్టార్‌ల కృషితో రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశ‌లే పెట్టుకున్నారు. కాగా దీపావ‌ళి సంద‌ర్బంగా మూవీ యూనిట్ ఓ ఫోటోను విడుద‌ల చేసింది.

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌, భీమ్‌ ఫర్‌ రామరాజు, రామరాజు ఫర్‌ భీమ్‌ టీజర్స్‌ విడుదలయ్యాయి. వీట‌న్నింటితో అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. అయితే దీపావ‌ళి స‌ర్‌ప్రైజ్‌గా రాజ‌మౌళి, రాంచ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్న ఫోటోను యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ఫోటోలో ముగ్గురు సాంప్ర‌దాయ‌మైన దుస్తుల్లో క‌నిపిస్తున్నారు. ఫోటో చూడ‌గానే దీపావ‌ళి క‌ళ ఇట్టే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా షేర్ అవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ట్రిపుల్‌ ఆర్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఎన్టీఆర్‌, చరణ్‌లతో పాటు అజయ్‌ దేవగణ్, ఆలియా భట్‌, రే స్టీవెన్‌ సన్‌, అలిసన్‌ డూడి, ఒలివియా మోరిస్‌ వంటి హాలీవుడ్‌ స్టార్స్‌ కూడా ఇందులో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here