దిల్ రాజు ద్వితీయ వివాహం

 

 

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ లో ఒకరైన దిల్ రాజు ద్వితీయ వివాహం ఆదివారం రాత్రి నిజామాబాద్ లో జరిగింది. మొదటి భార్య మరణించిన తరువాత ఒంటరిజీవితం లో వుండే వేదన చవిచూసిన తరువాత మళ్లీ పెళ్లి చేసుకోవాలని దిల్ రాజు అనుకున్నరు

అందరినీ పిలిచి, వైభవంగా డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు దిల్ రాజు. కానీ కరోనా కారణంగా కేవలం 15 మంది ఆత్యంత సన్నిహిత కుటుంబ సభ్యుల నడుమ వివాహం చేసుకున్నారు.

ఇకపై ఆమె పేరు వైఘ రెడ్డి అని మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రాలజీ ప్రకారం ఈ మార్పు చేసారని బోగట్టా. దంపతుల ఫొటోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. వైఘరెడ్డి వయసు 33 ఏళ్లు అని తెలుస్తోంది.

అన్నదమ్ములు, వారి భార్యలు, ఇరు వైపు ఆ మేరకు సాన్నిహిత్యం వున్నవారే హాజరయ్యారు. ఇదిలా వుంటే దిల్ రాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు తేజస్విని. కానీ పెళ్లి తరువాత పేరు మార్చుతున్నారని బోగట్టా. దంపతులకు తెలుగు సీఎం టీం నుచి శుభాకాంక్షలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here