జిమ్‌ వెయర్‌లో రచ్చ చేస్తోన్న అందాల భామ..!

ఆర్‌ఎక్స్‌100 సినిమాలో ఓవైపు అందాలు ఆరబోస్తూనే మరోవైపు నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి పాయల్‌ రాజ్‌పుత్‌. బుల్లితెర నటిగా కెరీర్‌ ప్రారంభించిన పాయల్‌ ఆర్‌ఎక్స్‌100తో ఒక సెన్సేషన్‌‌ నటిగా మారింది. ఇక అనంతరం మంచి అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకెళుతోందీ బ్యూటీ.

కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే పాయల్‌ రాజ్‌పుత్‌ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. తన హాట్‌ హాట్‌ ఫొటో షూట్‌లకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ యువతను ఫిదా చేస్తుందీ బ్యూటీ. ఇదిలా ఉంటే గతకొన్ని రోజులుగా కరోనాతో షూటింగ్‌లకు దూరంగా ఉన్న పాయల్ ఇటీవలే తిరిగి సినిమా చిత్రీకరణలో పాల్గొంది. దీంట్లో భాగంగానే లాక్‌డౌన్‌లో పెరిగిన బరువును తగ్గించుకునే పనిలో పడినట్లున్న పాయల్‌.. జిమ్‌ బాట పట్టింది. జియ్‌ వెయర్‌లో దిగిన కొన్ని హాట్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ చిన్నది..‘ఎలాంటి మార్పు లేనిదాకంటే నెమ్మదిగా మార్పు వైపు అడుగులు వేయడం మంచిది’ అనే క్యాప్షన్‌ను జోడించింది. మరి పాయల్‌ పోస్ట్‌ చేసిన ఆ ఫొటోలపై మీరూ ఓ లక్కేయండి..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here