అంకుల్ జగపతి బాబు .. మీరంటే నాకు 'అది' అంటోన్న అమ్మాయి :

లెజెండ్ సినిమాకి ముందర ఒకలాగా తరవాత ఒక లాగా అన్నట్టు అయిపొయింది జగపతి బాబు కెరీర్. స్టైలిష్ విలన్ గా కొత్త అవతారం ఎత్తిన జగపతిబాబు తీవ్రమైన మార్పులు తనలో తీసుకుని వచ్చాడు. వయసు అరవై కి దగ్గర పడుతున్నా కూడా కుర్ర అమ్మాయిలు నచ్చే మేలిమి హీరోలా పోజులు ఇస్తున్నాడు ఆయన. తెలుగు – తమిళ పరిశ్రమ లకి కొత్త విలన్ గా సూపర్ స్టైలిష్ అయిన జగపతి బాబు తాజాగా పటేల్ సర్ అనే సినిమాతో మన ముందరకి రాబోతున్నారు .నిన్న విడుదల అయిన ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మనకి అందుతున్న సమాచారం ప్రకారం జగపతి బాబు మ్యన్లీ లుక్ చూసి చాలా మంది ఆయనకి కాల్స్ చేస్తున్నారట.
ప్రొడ్యూసర్ లు కాదండోయ్ అమ్మాయిలు, కొంతమంది అబ్బాయిలు ఆంటీ ల మీద ఫుల్ మోజు తో ఉంటారు కదా అలాగే అమ్మాయిలు కూడా కొందరు అంకుల్స్ మీద ఆస్తక్తి తో ఉంటారు. వారిలో కొందరు జగపతి బాబు ని తరచూ ఇబ్బంది పెట్టడం ఫోన్ లు చెయ్యడం చేస్తున్నారు .. ఒకమ్మాయి మాత్రం ఆయన్ని కలవాల్సిందే అంటూ పట్టు పడుతోందట. వీలైనంత హుందాగా అలాంటివారిని అవాయిడ్ చేస్తున్న జగ్గూ భాయ్ తన స్టైల్ మారిస్తే ఇంత ఫాలోయింగ్ ఆ అంటూ ఆశ్చర్య పోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here