క‌రోనా వైర‌స్ మా ఆహార ప‌దార్థాల‌పై లేదు..

క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న ప‌రిస్థితుల్లో ఎగుమ‌తులు చేసుకుంటున్న వ‌స్తువుల‌పై కూడా క‌రోనా వైర‌స్ ఉంద‌న్న వాద‌న ఇప్పుడు ఎక్కువైంది. ప్ర‌ధానంగా చైనా ఎగుమ‌తి చేసుకుంటున్న ఆహార ప‌దార్థాల్లో క‌రోనా వైర‌స్ ఉంద‌న్న విష‌యం గుర్తించింది. దీంతో ఆయా దేశాల నుంచి వ‌స్తున్న ఎగుమ‌తుల‌ను చైనా ఆపేసింది.

ఇండియా నుంచి దిగుమ‌తి చేసుకున్న చేప‌ల్లో చైనా క‌రోనా వైర‌స్‌ను గుర్తించింది. ఇండియాలోను బ‌సు ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీ నుంచి ఈ చేప‌లు చైనాకు ఎగుమ‌తి అవుతున్నాయి. గ‌ట్ట‌క‌ట్టిన క‌టిల్‌ఫిష్ ప్యాకేజీలో మూడు శాంపిల్స్‌లో వైర‌స్ ఉన్న‌ట్లు క‌స్ట‌మ్స్ అధికారులు గుర్తించార‌ని తెలుస్తోంది. అందుకే ఈ దిగుమ‌తుల‌పై వారం పాటు నిషేధం విధించినట్లు ఆంగ్ల వార్తా సంస్థ రాయిట‌ర్స్ వెల్ల‌డించింది. అయితే చైనా ఇలా దిగుమ‌తుల‌ను నిలిపివేయ‌డం ఒక్క ఇండియా కంపెనీల‌కు మాత్ర‌మే కాకుండా ఇండోనేషియా, బ్రెజెల్, ఈక్వెడార్, ర‌ష్యా దేశాల నుంచి వ‌స్తున్న ఆహార ప‌దార్థాల‌ను కూడా ప‌రీక్షించింది.

అయితే ఆహార ప‌దార్థాలపై క‌రోనా వైర‌స్ ఉంద‌న్న విష‌యాన్ని ప‌లు దేశాలు స్పందిస్తున్నాయి. న్యూజిలాండ్ నుంచి దిగుమతి చేసుకున్న బీఫ్ ఉత్పత్తుల్లో కరోనా వైరస్‌ను గుర్తించామన్న చైనా వ్యాఖ్యలపై కివీస్ ప్రధాని జెసిండా అర్డెర్న్ స్పందించారు. తమ దేశం నుంచి ఎగుమతి అవుతున్న మాంసం ఉత్పత్తులు కరోనా రహితమైనవని స్పష్టం చేశారు. బ్రెజిల్, బొలీవియా, న్యూజిలాండ్ నుంచి వచ్చిన బీఫ్, ఇతర మాంసం ఉత్పత్తులు, వాటి ప్యాకేజింగ్‌పై కొవిడ్-19ను గుర్తించినట్టు చైనా నగరం జినాన్ పేర్కొంది. అలాగే, అర్జెంటినా నుంచి వచ్చిన ప్యాకేజింగ్‌లపై వైరస్‌ను కనుగొన్నట్టు మరో రెండు ప్రావిన్షియల్ రాజధానులు పేర్కొన్నాయి.

తమ ఉత్పత్తులపై వైరస్‌ను గుర్తించినట్టు సమాచారం లేదన్నారు. అర్జెంటినా నుంచి వచ్చిన బీఫ్ ఉత్పత్తుల ప్యాకేజింగ్‌లపై నిర్వహించిన పరీక్షల్లో వైరస్ ఉన్నట్టు తేలిందని సమాచారం వచ్చిందని, వాటికి పరీక్షలు నిర్వహించిన కోల్డ్ స్టోరేజీలోనే న్యూజిలాండ్ ఉత్పత్తులు కూడా ఉన్నట్టు చెప్పారని పేర్కొన్నారు. అయితే, వాటిపై వైరస్ ఉన్నట్టు మాత్రం తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు. కొవిడ్ ఉనికి ఉన్న ఉత్పత్తులను తాము ఎగుమతి చేయబోమని, కొవిడ్ రహితమైన వాటినే ఎగుమతి చేస్తామని ప్రధాని జెసిండా స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here