బీహార్‌లో అంతా నితీష్ కుమార్ చెప్పిన‌ట్లే జ‌రుగుతోందా..

బీహార్ రాజ‌కీయాల్లో అంతా చ‌క‌చ‌కా సాగిపోతూ ఉంది. ముఖ్య‌మంత్రిగా నితీష్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. సీఎంతో పాటు ఇద్ద‌రు ఉప‌ముఖ్యమంత్రులు, ప‌లువురు మంత్రులు కూడా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్.. తన కేబినేట్‌ను సైతం సిద్ధం చేసుకున్నారు.

బీహార్ ఎన్నిక‌ల్లో ఎన్డీయే విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ఎన్డీయేలో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. ఇందులో జేడీయూ అనుకున్నంత సాధించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ముందుగా అనుకున్న ప్ర‌కారం జేడీయూకే ముఖ్యమంత్రి పీఠం ఇచ్చేశారు. ముఖ్యమంత్రి పదవి జేడీయూకి అప్పగించినప్పటికీ ఉపముఖ్యమంత్రులు, స్పీకర్ పదవులను బీజేపీ తీసుకుంది. ఇక ఎన్డయే భాగస్వామ్య పక్షాలపై హెచ్‌ఏమ్, వీఐపీ పార్టీలకు చెరో మంత్రి పదవిని అప్పగించింది. బీజేపీ నేతలైన థార్ కిశోర్, రేణు దేవి ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం జేడీయూకి చెందిన విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, అశోక్ చైదరి, మేవా లాల్ చౌదరి.. ఇక బీజేపీ నుంచి మంగళ్ పాండే, అమరేంద్ర ప్రతాప్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. హిందుస్తాన్ ఆవామ్ మోర్చా పార్టీ అధినేత జీతన్ రాం మాంఝీ కుమారుడై సంతోష్ కుమార్ సుమన్.. వికాస్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముకేష్ సాన్హిలకు నితీష్ కేబినేట్‌లో చోటు దక్కింది. ఇక బీహార్ రాజ‌కీయ‌ల‌పై శివ‌సేన ఇదివ‌ర‌కే త‌న‌దైన శైలిలో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. నితీష్ ముఖ్య‌మంత్రి అయితే ఆ క్రెడిట్ త‌మ‌కే ద‌క్కుతుంద‌ని వ్యాఖ్యానించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here