‘ఎవరూ సాధించలేనిదాన్ని సాధించాలి.. గొప్ప పేరు తెచ్చుకోవాలి.. బాగా డబ్బు సంపాదించాలి’.. ఆనందం ఎప్పుడు లభిస్తుందంటే సాధారణంగా వచ్చే సమాధానాలివే. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న పనులు కూడా జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడతాయని చెబుతోంది అక్కినేని వారి కోడలు సమంత.
ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే సమంత ఇటీవల కరోనా కారణంగా ఇంటికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ సమయంలో ఏం చేశారన్న దానికి స్పందిస్తూ.. ‘గార్డెనింగ్ నాకు చాలా ఇష్టమైన వ్యాపకం. ఇది వరకు సినిమాలతో బిజీగా ఉండటంతో మొక్కల్ని పెంచడానికి సమయం దొరికేది కాదు. లాక్డౌన్ విరామంలో మొక్కల పెంపకంపై ఎక్కువ దృష్టిపెట్టా. ఇలాంటి చిన్న పనులు ఆనందాన్ని పెంపొందిస్తాయని తెలుసుకున్నా. చేసే పని ఏదైనా అంకితభావంతో శ్రమిస్తుంటా. అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటా. ఆ సంతృప్తి లేకపోతే ఏది చేయను. బంధాల్ని మరింత బలపరుచుకోవడానికి లాక్డౌన్ సమయం తోడ్పడింది. ఈ విరామంలో అనుబంధాల విలువ తెలుసుకున్నా’ అంటూ తన లాక్డౌన్ అనుభవాలను పంచుకుందీ బ్యూటీ.