క‌రోనా టీకాలో గుడ్ న్యూస్..

క‌రోనా మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ క‌నుగొనేందుకు ప్ర‌పంచ దేశాలు పోటీ ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే దీనిపై చివ‌రి ద‌శ‌కు ఆయా దేశాలు చేరుకున్నాయి. టీకాకు సంబందించిన కీల‌క విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌పంచంతో పంచుకుంటున్నాయి.

ఆక్స్‌ఫ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యం అభివృద్ధ చేస్తున్న టీకా ఆరు నెలల్లో అందుబాటులోకి రానుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఈ ఏడాది చివ‌రి కంతా అన్ని ర‌కాల ఆమోదాలు పొందుతుంద‌ని చెప్పారు. ఆ త‌ర్వాత వెంట‌నే వ్యాక్సిన్‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఆరు నెల‌ల కంటే త‌క్కువ స‌మ‌యంలోనే దీన్ని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న‌ట్లు ది టైమ్స్ ప‌త్రిక ప్ర‌చురించింది.

ఇక ర‌ష్యా అభివృద్ధి చేస్తున్న స్నుతిక్ వి టీకాకు మూడో ద‌శ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించేందుకు ఇండియా సిద్ధ‌మ‌వుతోంది. ఈ మేరకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ డ్ర‌గ్ కంట్రోల‌ర్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. మూడో ద‌శ ట్ర‌య‌ల్ష్ పూర్త‌యిన త‌ర్వాత ప‌ది కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఇండియాకు ఇచ్చేందుకు ర‌ష్యా అంగీకారం తెలిపిన విష‌యం తెలిసిందే. మ‌రో ఆరు నెల‌ల కాలంలో అన్ని వ్యాక్సిన్లు ట్ర‌య‌ల్స్ పూర్తి చేసుకొని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌స్తాయ‌న్న ధీమాను శాస్త్ర‌వేత్త‌లు అంచనా వేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో వ్యాక్సిన్ వ‌స్తే ముందుగా 60 సంవత్స‌రాలు పై బ‌డిన వారికి అంద‌జేస్తార‌ని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here