డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం విష‌యంలో గంద‌ర‌గోళం..

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌తో పాటు ఆయ‌న భార్యకు కూడా క‌రోనా సోకింది. అయితే తాను బాగున్నాన‌ని ట్రంప్ ప్ర‌క‌టించినా.. ఆసుప‌త్రి వ‌ర్గాలు చెబుతున్న స‌మాచారం మేర‌కు ఆయ‌న ఆరోగ్యం ఆందోళ‌న‌క‌రంగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ట్రంప్ వ‌య‌స్సు 74 సంవ‌త్స‌రాలు, స్థూల‌కాయం, కొవ్వు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల‌న ఆయ‌న‌కు చికిత్స చేసేందుకు ప‌లు ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది. ట్రంప్‌కు క‌రోనా సోకిన త‌ర్వాత ప‌లు ముఖ్య‌మైన అవయ‌వాలు ఆయ‌న్ను ఇబ్బంది పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఓవైపు ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నార‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు చెబుతున్నా.. ఆయ‌న డిశ్చార్జ్ అయ్యేందుకు స‌మ‌యం ప‌డ‌తుంద‌ని చెబుతున్నారు.

ట్రంప్ కోలుకోవ‌డానికి ఎంత స‌మ‌యం ప‌డుతుందో చెప్ప‌లేమ‌ని అంటున్నారు. మరో రెండు రోజులు గ‌డిస్తే కానీ ఏ విష‌యం చెప్ప‌డానికి కుద‌ర‌ద‌ని వైద్య వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ట్రంప్ అభిమానులు ఆందోళ‌న‌లో ప‌డ్డారు. మొన్న ప‌లు దేశాల‌కు సంబంధించిన నాయ‌కులు ఆయ‌న్ను ఎగ‌తాళి చేస్తూ మాట్లాడిన విష‌యం తెలిసిందే. కాగా ఇండియా మాత్రం ఆయ‌న్ను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంది. కాగా శ్వేత‌సౌధంలో ఇద్ద‌రు సెనేట‌ర్ల‌కు, ట్రంప్ మాజీ స‌ల‌హాదారుడు, ఎన్నిక‌ల ప్ర‌చార మేనేజ‌రు, ముగ్గురు పాత్రికేయుల‌కు కూడా క‌రోనా సోకింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here