అయోధ్యలో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌పై ఓవైసీ కామెంట్స్

అయోధ్య‌లో రామ మందిరం భూమి పూజ కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న వేళ ఎంఐఎం చీఫ్ అసుద్దీన్ ఓవైసీ స్పందించారు. బీజేపీ ప్ర‌భుత్వంపై  ఓవైసీ మండిప‌డ్డారు.  దేశ ప్ర‌ధానికి ఏ ఒక్క మ‌తంపై ప్రేమ ఉండ‌కూడ‌ద‌న్నారు. అయోధ్య వివాదంలో బీజేపీ, సంఘ్ ప‌రివార్ సుప్రీంకోర్టుకు అస‌త్యాలు చెప్పార‌న్నారు. ప్ర‌ధాని మోదీ హిందుత్వ‌వాదానికి పునాది వేశార‌న్నారు.

అయోధ్య రామ‌జ‌న్మ‌భూమి బాబ్రీ మ‌సీదు వివాదంలో 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వివాదాస్ప‌ద‌మైన భూమి రాంల‌ల్లాకు చెందుతుంద‌ని చెప్పిన న్యాయ‌స్థానం.. అయోధ్య‌లో మ‌సీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్‌బోర్డుకు 5 ఎక‌రాల స్థ‌లం కేటాయించాల‌ని ఆదేశించింది.

అయోధ్య‌లో రామాల‌యానికి నేడు శంకుస్థాప‌న జ‌రిగింది.ఈ నేప‌థ్యంలో అస‌దుద్దీన్ ఓవైసీ ట్విట్ట‌ర్ ద్వారా కూడా స్పందించారు. బాబ్రీ మ‌సీదు ఉండేది, ఉంది, క‌చ్చితంగా ఉంటుంది అనే అర్థం వ‌చ్చేలా బాబ్రీ జిందా హై అనే హ్యాష్ ట్యాగ్స్‌తో ట్వీట్ చేశారు.

అయోధ్యలో పీఎం మోడీ చేతుల మీదుగా రామ మందిర భూమిపూజ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here