బిగ్ బాస్ ప్రేక్షకులకు దివి పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి అవసరం లేదు. తన సొట్ట బుగ్గలతో.. క్యూట్ లుక్స్‌తో ఎంతో మందిని ఆకట్టుకున్న ఈ చిన్నది హౌజ్‌లో అందరితో ఇట్టే కలిసిపోయింది. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లను కూడా విజయవంతంగా పూర్తి చేస్తూ వచ్చింది. అయితే అనూహ్యంగా మోనల్ కంటే ఓట్లు తక్కువ పోల్ కావడంతో ఈ వారం బిగ్‌బాస్ హౌజ్ నుంచి దివి బయటకు వెళ్లిపోయింది. తన జీవితంలో ఎదురైన ఓ సంఘటనకు సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది దివి.
తన లవ్ స్టోరీ గురించి చెబుతూ.. ‘అమ్మ లెక్చరర్, నాన్న హెచ్‌సీయూలో ల్యాబ్ టెక్నీషియన్. నేను పుట్టకముందే హైదరాబాద్‌కు వచ్చేశారు. నేను యావరేజ్‌గా చదువుతాను. బీటెక్ తర్వాత ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఎంటెక్‌లో జాయిన్ అయ్యా.. ఆ సమయంలో నేను ర్యాంప్ వాక్ చేసి అందరి కళ్లల్లో పడ్డాను. నా కాంటాక్ట్ లిస్ట్ పెరిగిపోయింది. అలా సినిమాల్లోకి ప్రవేశించాను. అదే సమయంలో నేను ప్రేమలో పడ్డాను. కానీ ఇప్పుడు ఏ రిలేషన్లో లేను. సింగిల్‌గా ఉంటేనే బెటర్ అనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇక తన లవ్ ఎందుకు బ్రేకప్ అయిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘నా బాయ్‌ఫ్రెండ్ వాళ్ల తమ్ముడు మలేరియాతో చనిపోయాడు. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. నన్ను పల్లెటూరుకు రమ్మన్నాడు. నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లో పెరిగాను. పల్లెటూరు నాకు అలవాటు లేదు. అయినా కూడా వెళ్లొచ్చు కానీ అప్పటికే మా ఇద్దరికీ రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. పైగా నాకెంతో ఇష్టమైన మోడలింగ్, సినిమాలు వదిలేసుకోమన్నాడు. దీంతో నాకు నచ్చింది నేను చేస్తానని ప్రేమను వదిలేసుకున్నాను’ అని ఇలా తన విఫల ప్రేమ కథను ప్రేక్షకులతో పంచుకుంది. ఇక బిగ్‌బాస్‌తో దక్కిన ఫేమ్‌తో దివి ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకుంటుందో లేదో చూడాలి.