సోషల్‌ మెసేజ్‌తో నందమూరి హీరో ‘సారథి’..!

కెరీర్‌ తొలి నాళ్లలో అడపాదడపా కొన్ని చిత్రాల్లో నటించిన నందమూరి నటవారసుడు తారకరత్న ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నాడు. 2009లో వచ్చిన అమరావతి చిత్రంలో నెగిటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి నంది అవార్డు అందుకున్న తారకరత్న మళ్లీ తెరపై పెద్దగా కనిపించిందిలేదు. ఇక చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ‘సారధి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడీ నందమూరి హీరో. పంచభూత క్రియేషన్స్‌ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి జాకట రమేష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో తారకరత్న సరసన కోన శశిత హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. విజయ దశమి సందర్భంగా విడుదల చేసిన సారధి ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇక ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో ఉండే ‘కోకో’ క్రీడ చుట్టూ తిరుగుతుంది. ఇందులో తారకరత్న కోకో ఆటకు కోచ్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. అంతరించి పోతున్న గ్రామీణ క్రీడలను బతికించాలనే కాన్సెప్ట్‌ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ఫస్ట్‌ లుక్‌ చూస్తే అర్థమవుతోంది. మరి ఈ సరికొత్త కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాతోనైనా తారకరత్న మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కుతాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here