ఆ సినిమా గురించి అడగ్గానే ముఖ్యమంత్రి కి పిచ్చ విసుగు

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే, ప్రముఖ హీరోలు షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ కలిసి దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో నటించిన ‘పద్మావతి’అనేక సంచలనాలు, వివాదాలు సృష్టించింది దేశంలో. అప్పట్లో కొందరు ఈ సినిమా ను విమర్శించేవారు  ఏకంగా దీపికా పదుకునే తల నరుకుతామని బెదిరించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా  అనేక వివాదాలను అడ్డంకులను దాటుకుని  ఈ నెల 25న విడుదల కాబోతుంది. ఇన్ని వివాదాలకు కారణమైన ఈ సినిమా తమ  రాష్ట్రాల్లో విడుదల చెయ్యనివ్వం అని అప్పట్లో పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు అనడం జరిగింది.

ఈ క్రమంలో  ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఈ విషయంపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు యోగి ఆదిత్యనాథ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. త‌మ రాష్ట్రంలో ఈ సినిమా విడుదల అవుతుందా? లేదా? అని చెప్పడానికి తానేం జ్యోతిష్యుడిని కానని యోగి ఆదిత్యనాథ్ స‌మాధానం ఇచ్చారు. కాగా, త‌న సినిమా విడుద‌ల విష‌య‌మై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ద‌ర్శ‌కుడు భన్సాలీ చర్చించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here