దిల్ రాజ్ అంత రెమ్యున‌రేష‌న్ ఇస్తారా..

సినీ ఇండ‌స్ట్రీలో ఒక్క సినిమా హిట్ అయ్యిందంటే ఆ టీం మొత్తం ఎంతో సంతోష ప‌డుతుంది. ద‌ర్శ‌కుడు మ‌రో కొత్త సినిమా చేయాల‌ని.. నిర్మాత ఇంకా బాగా నిర్మించాల‌ని చూస్తారు. దీంతో వారి రెమ్యూన‌రేష‌న్ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు స‌రిగ్గా ఇదే జ‌రిగింది.

టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌3’ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ హీరో హీరోయిన్లుగా అనిల్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం ‘ఎఫ్‌2’ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అదే ఊపులో ‘ఎఫ్‌3’ స్టార్ట్‌ చేసిన దిల్‌రాజుకు రెమ్యునరేషన్స్‌ రూపంలో షాక్‌ తగిలిందట. వివరాల్లోకెళ్తే వెంకటేశ్‌ మినహాయిస్తే వరుణ్‌తేజ్‌, అనిల్‌ రావిపూడి మోస్తారు రెమ్యునరేషన్స్‌తోనే ‘ఎఫ్‌2’ సినిమాను చేశారు. సినిమా భారీ వసూళ్లను సాధించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వరుణ్‌తేజ్‌, అనిల్‌ రావిపూడి కూడా రెమ్యునరేషన్స్‌ పెంచేశారట. వినిపిస్తోన్న సమాచారం మేరకు వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, అనిల్‌లకు కలిపి దాదాపు పాతిక నుండి ముప్పై కోట్ల రెమ్యునరేషన్‌ను దిల్‌రాజు ఇస్తున్నాడట. సినిమా బ్లాక్‌బస్టర్‌ కావడం, క్రేజీ కాంబినేషన్‌గా పేరు రావడంతో దిల్‌రాజు సీక్వెల్‌ను చేస్తున్నాడని టాక్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here