‘ఆదిపురుష్‌’లో అజయ్‌ దేవగణ్‌..?

ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో క్యాస్టింగ్‌ కూడా భారీగానే ఉండేలా దర్శక నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సైఫ్‌ అలీఖాన్‌ వంటి సూపర్‌ హీరోను ఈ చిత్రంలో విలన్‌గా ఒప్పించారు. బాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరైన సైఫ్‌ను విలన్‌గా ఒప్పించడం అంత ఆశామాషీ విషయం కాదు. ఇక ఈ సినిమాను రామాయణ ఇతిహాస ఆధారంగా తెరకెక్కిస్తున్నారనే చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో సీత పాత్రలో ఎవరు నటించనున్నారనే దానిపై వార్తలు షికార్లు చేశాయి కానీ చిత్రయూనిట్‌ మాత్రం అధికారికంగా స్పందించలేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆదిపురుష్‌ చిత్రంలో మరో బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. అజయ్‌ ఈ చిత్రంలో శివుడి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఇక గతంలో ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ‘తానాజీ’ చిత్రంలో అజయ్‌ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అజయ్‌ దేవగణ్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆదిపురుష్‌ చిత్రాన్ని భారతదేశంలోని అన్ని భాషలతో పాటు ప్రభాస్‌కు విదేశాల్లో ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఇతర భాషల్లోకి డబ్‌ చేయనున్నారని సమాచారం. మరి ఆది పురుష్‌ ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here