కంగనా ముఖ్యమంత్రి అవుతుందనిపిస్తోంది: రామ్ గోపాల్ వర్మ

సమాజంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందించే రామ్ గోపాల్ వర్మ తాజాగా సంచలనం సృష్టిస్తోన్న కంగనా ఎపిసోడ్ పై కూడా స్పందించాడు. మహారాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కంగనా అన్నట్లు సాగుతోన్న విషయంపై ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘కచ్చితంగా మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కంగనా రనౌత్‌ అవుతుందనిపిస్తోంది. ఒకవేళ అదే గనుక జరిగితే బాలీవుడ్‌ వాళ్లందరూ టింబక్టుకు మకాం మార్చాలని ట్వీట్‌ చేశాడు. (టింబక్టు అనేది నైజీర్‌ నదికి సమీపంలోని మలి అనే దేశంలోని ఓ నగరం). అయితే మరో ట్వీట్‌ చేసిన వర్మ.. ‘కరోనా సోకిన భారత్‌కు వ్యాక్సిన్‌ లేదు. అలాగే కంగనా సోకిన శివసేనకు కూడా వ్యాక్సిన్‌ లేదు’. అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే.. బాంద్రాలోని కంగనా ప్రాపర్టీని అక్రమ మార్పుల పేరుతో బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేసింది. దీంతో కంగనా ఆగ్రహానికి లోనయ్యింది. తన ముంబై ఇప్పుడు పీవోకేగా మారిందని ఆమె కామెంట్ చేసింది. తన ఇంట్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేవని స్పష్టం చేసింది. మరి ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో చూడాలి.https://twitter.com/RGVzoomin/status/1303646253901701120

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here