ఏమవుతోంది హెలికాప్ట‌ర్ల‌కు.. త‌ప్పిపోతున్న ప్ర‌మాదాలు..

హెలికాప్ల‌ర్ల‌కు ఏమ‌వుతుందో అర్థం కావ‌డం లేదు. రెండు రోజుల వ్య‌వ‌ధిలో రెండు హెలికాప్ట‌ర్లు ఇబ్బంది పెట్టాయి. కేంద్ర మంత్రి ప‌ర్య‌టిస్తున్న హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం జ‌రిగి తేరుకోక‌ముందే మ‌రో హెలికాప్ట‌ర్ ఉన్న‌ట్టుండి ప్ర‌మాదంలో పడిపోయింది. దీంతో హెలికాప్ట‌ర్ల‌కు ఏమైందో అన్న ఆందోళ‌న అంద‌రిలోనూ నెల‌కొంది.

కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ బీహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. ఈ నేప‌థ్యంలో పాట్నా విమానాశ్రయంలో క‌రెంటు తీగ‌లు త‌గ‌ల‌డంతో హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి గురైంది. తృటిలో పెను ప్రమాదం త‌ప్పింది. కరెంట్ తీగలకు తగలడం వల్ల హెలిక్యాప్టర్ రెక్కలు విరిగిపోయాయి. దీంతో ఒక్క‌సారిగా అక్కడున్న వారంతా షాక్‌కు గుర‌య్యారు. అయితే ప్ర‌మాదంలో ఎవ్వ‌రికీ ఏమీ కాలేదు. కేంద్ర మంత్రి క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. దేశం మొత్తం దీని గురించి మాట్లాడుకుంటున్న త‌రుణంలోనే మ‌రో హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం జ‌రిగింది.

తిరుమ‌ల ద‌ర్శ‌నం కోసం హెలికాప్ట‌ర్‌లో వ‌స్తున్న ఓ కుటుంబానికి సంబంధించిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి గురైంది. తమిళనాడుకు చెందిన ఎస్వీఎన్ జ్యూవలరీ అధినేత శ్రీనివాసన్ కుటుంబ స‌భ్యుల‌తో తిరుమ‌ల‌కు హెలికాప్ట‌ర్‌లో బ‌య‌లు దేర‌గా.. కుప్పం స‌రిహ‌ద్దులోని తిరుప‌త్తూరు జిల్లాలో పొగ‌మంచు క‌మ్మేసింది. దీంతో కాసేపు గాలిలోనే చ‌క్క‌ర్లు కొట్టిన హెలికాప్ట‌ర్ అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయ్యింది. పొలాల్లో క్షేమంగా ల్యాండ్ అవ్వ‌డంతో ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. హెలికాప్ట‌ర్లో ఇద్ద‌రు పైలెట్ల‌తో పాటు మొత్తం ఏడుగురు ఉన్నారు. ఆ త‌ర్వాత వాతావ‌ర‌ణం అనుకూలించ‌డంతో హెలికాప్ట‌ర్ తిరుప‌తికి బ‌య‌లుదేరింది. రెండు రోజుల వ్య‌వ‌ధిలో రెండు హెలికాప్ట‌ర్ల‌కు ప్ర‌మాదం త‌ప్ప‌డంతో ప‌బ్లిక్‌లో చ‌ర్చ మొద‌లైంది. అయితే ఎవ్వ‌రికీ ఏమీ కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here