ఒబామా రాసిన పుస్త‌కంపై కోర్టుకు వెళ్లారు..

అమెరికా మాజీ అధ్య‌క్షుడు బరాక్ ఒబామా ఇటీవ‌ల రాసిన పుస్త‌కం వివాదాస్ప‌దం అవుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీపై పుస్త‌కంలో రాసిన వ్యాఖ్య‌లపై కాంగ్రెస్ శ్రేణులు మండిప‌డుతున్నాయి. మొత్తానికి ఒబామా రాసిన ది ప్రామిస్డ్ లాండ్ పుస్త‌కం రిలీజ్ అయ్యింది.

ఆల్ ఇండియా రూరల్ బార్ అసోసియేషన్ దీనిపై స్పందించింది. బరాక్ ఒబామాపై ఉత్తరప్రదేశ్‌లోని లాల్‌గంజ్ సివిల్ కోర్టులో సివిల్ సూట్ దాఖలైంది. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌పై, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీపై ఒబామా చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని, వారిద్దరికి ఉన్న లక్షల మంది ఫాలోవర్లను మనోభావాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయని ఆల్ ఇండియా రూరల్ బార్ అసోసియేషన్ జాతీయ అధక్షుడు గ్యాన్ ప్రకాష్ శుక్లా ఈ సూట్ దాఖలు చేశారు. అంతే కాకుండా దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గ్యాన్ ప్రకాష్ శుక్లా, తాజాగా కోర్టులో సివిల్ సూట్ దాఖలు చేశారు. భారత రాజకీయ నేతలపై ఆరోపణలు చేయడం దేశ సౌభ్రతృత్వంపై దాడి చేయడమేనని ఆయన అన్నారు. ఒబామాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయకపోతే తాను అమెరికా ఎంబసీ తలుపు తడతానని ప్రకాష్ శుక్లా తెలిపారు. పుస్తకంలో మన్మోహన్, రాహుల్ గురించి ప్రస్తావించారు. రాహుల్‌కు ఇబ్బంది లేకుండా ఉండేందుకే మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా సోనియా గాంధీ ఎంచుకున్నారని అన్నారు. మన్మోహన్‌ అసాధారణ మేధావి అని, అయితే తన పదవి సోనియాకు రుణపడి ఉందని చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ గాంధీ గురించి ప్రస్తావిస్తూ అంతగా ప్రతిభలేని, నిరాశవాదుడని.. తన కోర్సు పూర్తి చేయకుండా ఉపాధ్యాయుల ప్రశంసల కోసం ఎదురుచూసే విద్యార్థి లాంటి వారని రాసుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here