ఒక్క రాత్రిలోనే 10 కోట్ల రూపాయ‌లు సొంతం చేసుకున్నాడు..

రాత్రికి రాత్రి ఓ వ్య‌క్తికి అదృష్టదేవ‌త వ‌రించింది. ఎంత‌లా అంటే శ‌వ పేటిక‌లు త‌యారుచేసుకునే స్టేజి నుంచి ఏకంగా కోట్ల రూపాయ‌ల‌కు అధిప‌తి అయ్యేలా అత‌ని జీవితం మారిపోయింది. రాత్రి ఓ ఉల్క దూసుకొచ్చి ప‌డింది. దీంతో ఏకంగా ప‌ది కోట్ల రూపాయ‌ల‌కు అధిప‌తి అయిపోయాడు.

ఇండోనేషియాలోని నార్త్ సుమత్రలో, కోలంగ్‌లో నివాసం ఉంటున్న జోసువా హుటగలుంగ్ శవ పేటికలను తయారు చేస్తూ జీవిస్తున్నారు. ఎప్ప‌టిలాగే రాత్రి స‌మ‌యంలో శ‌వ పేటిక త‌యారుచేసుకుంటుండ‌గా ఉన్న‌ట్టుండి పై నుంచి ఏదో దూసుకొచ్చి కింద ప‌డిపోయింది. ఆయన ఇంటిపై నుంచి ఓ ఉల్క దూసుకొచ్చింది. ఆ ఉల్క తన ఇంటి పై కప్పును చీల్చుకుని, నేలపై పడి, 15 సెంటీమీటర్ల లోతులో కూరుకుపోయింది. దీని బరువు 2.1 కేజీలు ఉంది. నాణ్యత, బరువును బట్టి ఉల్కలకు విలువ కడతారు. ఒక గ్రాముకు 0.50 డాలర్ల నుంచి 5.00 డాలర్ల వరకు పలుకుతుంది. ఒక్కొక్కసారి మరింత ఎక్కువ ధర కూడా చెల్లిస్తారు.

జోసువా మాట్లాడుతూ తాను ఈ ఉల్కను పట్టుకున్నపుడు వేడిగా ఉందని తెలిపారు. ఇది తన ఇంటిపై పడినపుడు భారీ శబ్దం వినిపించిందన్నారు. ఇంటి భాగాలు కదిలినట్లు తెలిపారు. ఇది 4.5 బిలియన్ సంవత్సరాలనాటిదని తెలిసిందన్నారు. ఇది సీఎం1/2 కార్బొనేసియస్ ఛోండ్రైట్ వర్గానికి చెందినదన్నారు. ఇది అత్యంత అరుదైన రకానికి చెందినదని తెలిపారు. ఈ విష‌యం తెలిసిన వారంతా షాక్‌కు గుర‌వుతున్నారు. చాలా మంది ఇలాంటి అదృష్టం త‌మ‌కు ద‌క్క‌లేద‌ని అనుకున్నారు. ఎంత‌నైనా ఇలాంటివి జ‌ర‌గాలంటే పెట్టి పుట్టాలంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here