త్రివిక్రమ్ – వెంకటెష్ సినిమా ..

టాలీవుడ్ అగ్రకథానాయకులలో వెంకటేశ్ ఒకరు. ప్రముఖ నిర్మాత రామానాయుడు తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, తన టాలెంట్ తో అగ్రకథానాయకుడిగా ఎదిగారు .. ఆ స్థానాన్ని సుదీర్ఘ కాలంగా ..  పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నారు. రేపు ఆయన పుట్టిన రోజు .. ఈ సందర్భంగా ‘హారిక హాసిని క్రియేషన్స్ వారు .. త్రివిక్రమ్ .. వెంకటేశ్ కాంబినేషన్లో తమ సినిమా వుండనున్నట్టు అధికారికంగా ఒక ప్రకటన చేశారు.
 వెంకటేశ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన స్పెషల్ పోస్టర్ ను కూడా వాళ్లు ఈ సందర్భంగా రిలీజ్ చేశారు. రచయితగా త్రివిక్రమ్ ‘నువ్ నాకు నచ్చావ్’ .. ‘మల్లీశ్వరి’ వంటి హిట్ సినిమాలకి వెంకటేశ్ తో కలిసి పనిచేశారు. మళ్లీ ఇంతకాలానికి ఈ సినిమాకి పనిచేయనుండటం విశేషం. ప్రస్తుతం పవన్ తో ‘అజ్ఞాతవాసి’ చేస్తోన్న త్రివిక్రమ్ ఆ తరువాత సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నారు. ఈ లోగా తేజ .. అనిల్ రావిపూడి ప్రాజెక్టులను వెంకటేశ్ పూర్తి చేసేస్తాడన్న మాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here