నిర్మాతలకి వెంకీ, త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ ఫోన్లు!!

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అజ్ఞాతవాసి’ భయంకరమైన డిజాస్టర్ కావడంతో తీవ్ర నిరుత్సాహం తో కృంగిపోయారు ప్రొడ్యూసర్ రాధాకృష్ణ, డైరెక్టర్ త్రివిక్రమ్.అలాగే వీరిద్దరి కాంబినేషన్లో రెండు పెద్ద సినిమాలు బడా హీరోల తో ఉన్నాయి..అందులో ఒకటి విక్టరీ వెంకటేష్ తో అయితే మరొకటి జూనియర్ ఎన్టీఆర్ తో. ఈ క్రమంలో ‘అజ్ఞాతవాసి’ ఫలితం తెలుసుకున్నాక వెంకటేష్ నేరుగా ఫోన్ లో నిర్మాత రాధాకృష్ణ తో మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో ఇటువంటివి మామూలేనని ధైర్యం చెప్పారట జరిగిన దాన్ని లైట్ గా తీసుకుని నెక్స్ట్ తనతో  చేయబోయే సినిమా మీద ఫోకస్ పెట్టమని వెంకటేష్ అన్నాడట.

ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా  డైరెక్టుగా డైరెక్టర్ త్రివిక్రమ్ కు ఫోన్ చేసి  మనం కచ్చితంగా హిట్టు కొడుతున్నాం ..మీరు బౌన్స్  బ్యాక్ అవుతారు ..నిరుత్సాహ పడవద్దని చెప్పారట .ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో వచ్చే సినిమా పూర్తిగ లవ్ అండ్  ఫ్యామిలీ కథ నేపథ్యంలో తెరకెక్కుతుందట. దర్శకుడు ఏది చెబితే దానికి రెండింతలు చేసే సత్తా కలిగిన జూ.ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా బాగానే వుంటుందని సినీ ప్రేమికులు అంటున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here