కత్తి మహేష్ తో మాట్లాడబోతున్న చిరంజీవి ?

ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ హీరో పవన్ కళ్యాణ్ మధ్య వివాదాన్ని పరిష్కరించే దిశగా ముందడుగు వేయాలని వివాదానికి తెర దించాలని పవన్ కళ్యాణ్ అన్న అయిన చిరంజీవికి సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సూచించారు.అంతేకాకుండా గతంలో చిరంజీవి రాజకీయ అరంగేట్రం టైం లో హీరో రాజశేఖర్ చిరంజీవి మిద చేసిన వ్యాఖ్యలకు హీరో రాజశేఖర్ మీద అబిమానులు దాడి చేయడం జరిగింది. ఆ సమయంలో చిరంజీవి స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి, ఒక మంచి సంస్కృతికి నిదర్శనమై.. ఆ వివాదంను మీరు పరిష్కరించారు అని గుర్తు చేశారు.

కానీ కత్తి మహేష్ విషయంలో పవన్ కళ్యాణ్ ఆయనకున్న గుణగణాలను బట్టి ఆయన ఎవరికీ తలవంచే వ్యక్తి కాదు. ఇది జగమెరిగిన సత్యం.మరోపక్క ఈ వివాదం అభిమానులకు కత్తి మహేష్ మధ్య తీవ్ర దారులకు దారితీస్తుంది మరోపక్క మీ కుటుంబ పరువు ఉన్న గౌరవం సన్నగిల్లుతుంది. మిమ్మల్ని అభిమానించే మా అందరినీ ఈ వ్యవహారం ఆందోళనకు గురి చేస్తుంది. బయట మీ కుటుంబం అంటే గిట్టనివారు ఈ వివాదంను పెంచి పోషించుచూ నవ్వుకుంటున్నారు. ఎలాగైన మీరు పెద్ద మనసు చేసుకుని సహృదయభావంతో కత్తి మహేష్‌ని పిలిచి, మాట్లాడి ప్రజలలో మీ పట్ల గౌరవంని ప్రదర్శించి.. ఈ సంక్రాంతితో ఈ వ్యవహారానికి ముగింపు పలికి.. చిరంజీవి.. చిరంజీవిగా మా గుండెల్లో ఉండాలని కోరుకుంటున్నాం.” అని కేతి రెడ్డి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here