‘అజ్ఞాతవాసి’కి నైజాంలో దెబ్బే..!

భారీ అంచనాల మధ్య సంక్రాంతి బరిలో మొదటగా విడుదలైన అజ్ఞాతవాసి సినిమా అందరిని  నిరాశపరిచింది మొదటి రోజునుండి ఫ్లాప్ టాక్ రావడంతో సినిమా వసూళ్లు తగ్గుముఖం పట్టాయి.ఇప్పుడు ఈ సినిమా కొన్న బయ్యర్లు తలలు పట్టుకుంటున్నారు.ముఖ్యంగా ఈ సినిమా ఫలితం నైజాం ఏరియాపై ఎక్కువగా ఉంది.దాదాపు భారీ మొత్తంతో కొన్నా నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ప్రస్తుతం ఉన్న కలెక్షన్లు చూసుకుంటే పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడం కష్టమే అనిపిస్తుంది.

ఇక సిడేడ్ లో 16కోట్లకు  అమ్ముడుపోయిన ఈ సినిమా , కేవలం 3 కోట్ల 40 షేర్ మాత్రమే వచ్చిందని సమాచారం. మరో ఐదు రోజుల్లో కానీ సినిమా వసూళ్లపై సరైన స్పష్టత చెప్పలేం.అయితే ప్రస్తుతానికి  ఎక్కువ మొత్తం థియేటర్లలో విడుదల చేయడం వల్ల మరియు ఎక్కువ షో లు  పడటం  వలన ఈ మాత్రమైనా వసూళ్లు వచ్చాయని  అంటున్నారు.ఏదిఏమైనా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి కొన్న  బయ్యర్లకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఇండస్ట్రీ టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here