వెంకయ్యనాయుడు ఆగ్రహానికి కారణం ఏంటి….

రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బిల్లులు ప్రవేశపెట్టిన సమయంలో తీవ్ర గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో ఆయన సభ్యుల ప్రవర్తనపై మండిపడ్డారు. కాగా రాజ్యసభ లో ఘర్షణ వాతావరణం కల్పించిన సభ్యులపై ఆయన వేటు వేశారు.

రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ వాస్తవ్, రిపూన్ బోరా, సయ్యద్ నజీర్ హుస్సేన్, ఆప్ సభ్యుడు సంజయ్ సింగ్, టి.ఎమ్.సి ఎంపిలు డెరికో ఓబ్రెను, డోలా సేన్, సీపీఎం ఎంపీలు కరీం, కె.కె. రాజేష్ లను సస్పెండ్ చేస్తూ వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకున్నారు. కాగా డిప్యూటీ చైర్మన్ ప్రజాస్వామ్య విలువలు తుంగలో తొక్కి వ్యవసాయ బిల్లులు ఆమోదించుకున్నారని  ఆరోపిస్తూ ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే సస్పెండ్ అయిన సభ్యులు వెంకయ్య నాయుడు నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల వోటింగ్ సందర్భంగా విపక్ష పార్టీల సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం అందరూ చూసారు. అయితే ఎంపీలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం రెండు బిల్లులను ఆమోదించుకుంది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లులను ప్రతిపక్ష పార్టీలతో పాటు మిత్ర పక్షాలు కూడా వ్యతిరేకించాయి. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. తెలుగు రాష్ట్రాలలో తెలంగాణా బిల్లులను వ్యతిరేకించగా.. ఏపీ ఎంపీలు మోడీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. సభా సంప్రదాయాలు గౌరవించకుండా విపక్ష సభ్యులు ప్రవర్తిస్తున్నారని వెంకయ్య నాయుడు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here