ఆ హీరోయిన్ ఫోటో పెట్టి పోగిడేసిన వర్మ

సాధారణం గా ఎవ్వరి మీదా పొగడ్తలు కురిపించే అలవాటు లేని రామ్ గోపాల్ వర్మ తిట్టమంటే మాత్రం తెగ తిడతాడు. పొగుడుతూ కనిపించినా తిట్టడం లో దిట్ట అయిన వర్మ ఇప్పుడు నిజంగానే ఒకరిని పొగిడేస్తున్నాడు . ఆ పోగిడించుకునే వ్యక్తి కూడా ఎవరో కాదు హీరోయిన్ శ్రీదేవి. ఆయన ఆరాధ్య దేవత గా శ్రీదేవి గురించి మాట్లాడే వర్మ , అతని శృతి మించిన అభిమానం తో ఆమెనీ ఆమె భర్త నీ చాల సార్లు ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేకపోలేవు.

బోణీ కపూర్ ని మర్డర్ చెయ్యాలని ఉంది అంటూ ఎన్నో సార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ ఇప్పుడు శ్రీదేవి చిన్ననాటి ఫోటో ఒకటి ట్విట్టర్ లో పెట్టి ” ఈ చిన్ని అమ్మాయి భారతీయ సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అవుతుందని ఎవరు ఊహించగలరు? శ్రీదేవి ఓ అద్భుతం” అంటూ ట్వీట్ చేశాడు. తన తల్లి తండ్రులతో శ్రీదేవి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో అది. వర్మ చెప్పినమాట అక్షరాలా వాస్తవం. అందులో శ్రీదేవి బంగారు బొమ్మ లాగా ఉంది. వెటకారం లేకుండా వర్మ ఈ మధ్య చేసిన ట్వీట్ ఇదే కాబోలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here