నితిన్ పెళ్లికి టైమ్ అండ్ డేట్ ఫిక్స్.

యంగ్ హీరో నితిన్ పెళ్లి ఈ నెల 26న జరగబోతున్నట్లు మేము ఇప్పటికే వెల్లడించాము. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ తేదీనే నితిన్ వివాహం జరుగనుంది. రాత్రి 8 గంటలకు వివాహం జరుగుతుందట. ప్రస్తుతానికి లొకేషన్ గురించి సస్పెన్స్‌ గా ఉంచబడింది. దుబాయ్ లో భారీగా ఓ డెస్టినేషన్ మ్యారేజ్ ప్లాన్ చేసిన నితిన్ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. ఇకపోతే నితిన్ కరోనా అనంతరం వెంకీ అట్లూరి డైరెక్షన్లో ‘రంగ్ దే’ చిత్రం షూట్ ను చేయనున్నారు.

ఇది కాకుండా కృష్ణ చైతన్య దర్శకత్వంళో ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు నితిన్. ఇక కరోనా సంగతి ఎలా ఉన్నా…టాలీవుడ్ లో పెళ్లి సందడి నడుస్తుంది. ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ తన ప్రేయసి డాక్టర్ పల్లవి పెళ్లి చేసుకున్నారు. ఇక రానా దగ్గుబాటి తన లవర్ మిహికా బజాజ్ మెడలో ఆగస్టు 8న మూడుముళ్లు వేయనున్నారు.

కాగా కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గే సూచనలు లేవు. రోజులు గడిచే కొద్ది కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. దీనితో ఇంకా ఎదురు చూడడం అనవసరం అనుకున్న హీరోలు మొత్తానికి పెళ్లికి ముహూర్తం పెట్టేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here