మెగా హీరో డెబ్యూ మూవీ సంక్రాంతి బరిలో

ఉప్పెన మూవీకి అన్నీ మంచి శకునాలే అనుకున్నారు. విడుదల అవడమే లేటు.. హిట్ ఖాయమే అన్నారు. తీరా కొన్నిరోజులలో విడుదల అనగా మూవీ విడుదల వాయిదా పడింది. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడడంతో మూవీ విడుదల జరగలేదు. ఎప్పుడో ఏప్రిల్ లో విడుదల కావాల్సిన మూవీ ఇంకా బాక్సులకే పరిమితం అయ్యింది. మరి ఇంత లేటైనా ఉప్పెన నిర్మాతలు థియేటర్ విడుదలనే కోరుకుంటున్నారు. ఓ టి టి కి ససేమిరా అంటున్నారు.

ఇప్పట్లో కరోనా తాకిడి తగ్గే సూచనలు కనిపించడం లేదు. దీనితో 2021 సంక్రాంతికి ఉప్పెన మూవీ విడుదల చేయాలని భావిస్తున్నారట. సాయి ధరమ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీగా ఉప్పెన తెరకెక్కింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా తమిళ వర్సిటైల్ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక రోల్ చేస్తున్నారు. దర్శకుడు సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here