ఢిల్లీ స‌రిహ‌ద్దులో వేలాది మంది రైతులు.. అడ్డుకుంటున్న పోలీసులు..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ బిల్లుల‌కు వ్య‌తిరేకంగా ప‌లు రాష్ట్రాల్లో రైతులు తీవ్ర ఆందోళ‌న‌ల‌కు దిగుతున్నారు. పంజాబ్, హర్యానాల్లో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పంజాబ్‌లో కొద్ది రోజులుగా రైళ్ల రాకపోకపలు నిలిచిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోచవ్చు. కాగా, పంజాబ్‌లోని వేల మంది రైతులు హర్యానా సరిహద్దుకు చేరుకున్నారు.

ఢిల్లీ ఛలో మార్చ్‌కు కదిలేందుకు వేలాది మంది రైతులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హర్యానా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం హర్యానా సరిహద్దులో రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. కురుక్షేత్రకు చేరుకున్న రైతులను ఢిల్లీ వైపు కదలకుండా వాటర్ కెనాన్‌లు ప్రయోగించి చెదరగొట్టారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రైతులు.. అక్కడే నిరసనకు దిగారు. అనంతరం అక్కడే క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళనకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్ బలగాలను పెద్దసంఖ్యలో మోహరించారు.

హర్యానా రాష్ట్రం నుంచి పంజాబ్ కు బస్సుల రాకపోకలను రద్దు చేశామని హర్యానా రవాణ శాఖ మంత్రి మూల్ చంద్ శర్మ చెప్పారు. హర్యానాలో రైతుల ఆందోళన వల్ల 144 సెక్షన్ విధించారు.ఢిల్లీ చలో రైతుల ఆందోళన నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు మెట్రోరైళ్ల రాకపోకలను ముందుజాగ్రత్తగా నిలిపివేశారు. అంబాలా, కురుక్షేత్రల వద్ద రైతులను చెదరగొట్టేందుకు వాటర్ కానన్ లను రంగంలోకి దించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here