నాపై కేసులు ఉన్నాయి.. అయినా నాకు ఓటు వేసి గెలిపించండి..

అంద‌రూ ప్ర‌జాసేవ చేయ‌డానికి రాజ‌కీయాల్లోకి వ‌చ్చామ‌ని చెబుతుంటే బీహార్ ఎన్నిక‌ల్లో ఓ అభ్య‌ర్థి మాత్రం తాను డబ్బులు సంపాదించుకోవ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌చారానికి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళుతున్న ఈయ‌న తాను సంపాద‌న కోస‌మే పోటీ చేస్తున్న‌ట్లు చెప్పి ఓట్లు అడుగుతున్నారు.

నలందా జిల్లా బర్బీఘా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా రాజేంద్ర‌ప్ర‌సాద్ అనే వ్య‌క్తి పోటీ చేస్తున్నాడు. అయితే ఈయ‌న ప్ర‌చారం ప్రారంభించారు. ఈయ‌న‌పై ఉన్న కేసుల వివ‌రాలు అన్నీ చెబుతూనే డ‌బ్బు కోసం ఎమ్మెల్యే అవ్వాల‌నుకుంటున్న‌ట్లు ప్ర‌జ‌ల‌కు చెబుతున్నాడు. ఇంత‌కాలం టైల‌ర్ గా ప‌నిచేశాన‌ని అందుకే ఇక డ‌బ్బులు సంపాదించేందుకు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌జా సేవ చేయాల‌న్న ఉద్దేశం త‌న‌కు లేదంటున్నాడు.

పైగా త‌న‌పై ఇప్ప‌టికే ఓ అత్యాచారం, భూ వివాదం కేసు కూడా ఉన్న‌ట్లు చెప్పాడు. ప్ర‌జ‌ల్లోకి వెళుతూ ఇవ‌న్నీ చెబుతూ ఓట్లు అడుగుతున్నాడు. దీంతో ప్ర‌జ‌లంతా ఈయ‌న్ను చూసి షాక్ అవుతున్నారు. కాగా ప‌లువురు మాత్రం నిజాలు చెప్పి అభ్య‌ర్థిగా ప్ర‌చారం చేయ‌డం గ్రేట్ అంటున్నారు. ఈ కాలంలో ప్ర‌తి ఒక్క రాజ‌కీయ నాయ‌కుడికి కేసులు ఉన్నాయ‌ని అయితే ఎవ్వ‌రూ దీన్ని బ‌య‌ట పెట్ట‌డం లేదు. పైగా ప్రజా సేవ చేస్తామ‌ని చెప్పి.. గెలిచిన త‌ర్వాత కోట్ల రూపాయ‌లు ఆస్తులు వెన‌కేసుకుంటున్నారు. కానీ ఈయ‌న మాత్రం నిజాయితీగా ఏం చేస్తారో అదే చెబుతున్నార‌ని అంటున్నారు.

ఏదిఏమైనా ఇలా కేసులు ఉన్నాయి, డ‌బ్బుల కోస పోటీ చేస్తున్నా అని నిజాలు చెబితే ఓట్లు వేయ‌డానికి జ‌నం పిచ్చోల్లా. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్తి భిన్నంగా సాగుతున్నాయ‌ని మాత్రం చెప్పొచ్చు. మొన్న ఓ వ్య‌క్తి బిక్షం ఎత్తుకొని వ‌చ్చిన డ‌బ్బులతో నామినేష‌న్ వేశారు. మ‌ళ్లీ బిక్ష‌మెత్తుకొని ఎన్నిక‌ల్లో పోటీకి ఖ‌ర్చు పెడ‌తాన‌ని చెప్పారు. ఇప్పుడు ఈయ‌న ఇంకోలా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here